Friday, November 22, 2024

రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన అనిత

ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనిత మంచి సక్సెస్ ను సాధించింది. ఆ తర్వాత కూడా కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. కానీ అనుకున్న స్థాయిలో సినిమాలు చేయలేకపోయింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ కూడా అవకాశాలు అంతగా రాకపోవడంతో హిందీ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత వివాహం చేసుకుంది.

కాగా పెళ్లయిన ఏళ్ళ తర్వాత అనిత ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఓ బాబు కు జన్మనిచ్చింది. కాగా ఆ బాబుకి ఆరవ్ అనే పేరు పెట్టారు. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో అనిత సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించారు అనిత. ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా నా కొడుకు పైనే ఉందని కొంత సమయం తర్వాత మళ్లీ నటిస్తాను అని క్లారిటీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement