కరోనా సమయంలో షూటింగ్ లు లేక సినీతారలు హీరోలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది సినీ తారలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. గత లాక్ డౌన్ లో దగ్గుబాటి రానా, నిఖిల్, నితిన్ ఇలా చాలామంది పెళ్లి చేసుకున్నారు. ఇక మొన్నటికి మొన్న హీరోయిన్ ప్రణీత కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు.
ఇటీవల ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో వచ్చే షో లో శ్రీముఖి పాల్గొంది. అందులో మాట్లాడుతూ నేను కమిటెడ్. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. అయితే సీరియస్ గా చెప్పిందో లేక సరదాగా అలా స్పందించిందో తెలియదు గానీ…. జనం మాత్రం నిప్పు లేకుండా పొగ రాదు అంటూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా శ్రీముఖి తొందరలోనే పెళ్లి చేసుకోబోతోంది అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఆమెకే తెలియాలి.