బుల్లితెర యాంకర్, వెండితెర రంగమ్మత్తగా అనసూయకు విపరీతమైన పాపులారిటీ ఉంది. సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడూ ఏదో పోస్ట్ పెట్టి వివాదంలో ఇరుక్కుంటుంది. అనసూయకు సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా నెగెటివిటీ ఎదురవుతూ ఉంటుంది. తనపై జరిగే ట్రోలింగ్‌ను సైతం అనసూయ అంతే స్థాయిలో తిప్పి కొడుతుంటారు. ఈసారి మాత్రం చాలా హెల్త్ టిప్స్ చెప్పి నెటిజన్ల అందరి మనసు దోచుకుంది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తన సీక్రెట్స్ అన్నీ కూడా బయటపెట్టేశారు అనసూయ.
ఉదయాన్నే కచ్చితంగా గోరు వెచ్చని నీళ్లు తాగాలి.. కాసింత వ్యాయామం చేయాలి.. ఆ తరువాత ప్రాణాయామం చేయాలి. ఏదైనా తిన్నా తరువాత కనీసం 30 నిమిషాలు ఏదో ఒక చిన్న పని చేయాలి.. ఖాళీగా కూర్చోకండి.. రాత్రి ఏడు, ఏడున్నర గంటలలోపు కచ్చితంగా భోజనం చేసేయాలి.. ఏదైనా చేసే ముందుకు ఎందుకు చేస్తారో.. ఆలోచించండి.. అప్పుడు ఎలాంటి బాధలు లేకుండా హ్యాపీగా ఉంటారు అని అనసూయ తన సీక్రెట్స్ అన్నీ కూడా బయటకు చెప్పేశారు. మామూలుగా అయితే హెల్త్ సీక్రెట్స్‌ను, తమ అలవాట్ల గురించి ఎవ్వరూ చెప్పరు. కానీ తాజాగా అనసూయ మాత్రం అన్నింటిని పూస గుచ్చినట్టు వివరించారు. మీరు ఏం అనుకోకుంటే.. ఫైవ్ హెల్త్ సీక్రెట్స్, మీ అలవాట్లను చెబుతారా? అని మర్యాద పూర్వకంగా అడిగేశారు. దీనికి అనసూయ సమాధానంగా తన సీక్రెట్స్ మొత్తం చెప్పేశారు