Friday, November 22, 2024

పడుకున్నావ్ కాబట్టే ఇండస్ట్రీలో వచ్చావ్…. నెటిజన్ కామెంట్ కి అనసూయ రిప్లయ్ ఏంటో తెలుసా ?

యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో అభినయంతో కామెడీ టైమింగ్ తో ఓవైపు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వెండితెర పై కూడా మెరుస్తూ ఉంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అందరినీ తన వైపు తిప్పుకుంది. పెళ్లయిన తర్వాత కెరీర్ ని ప్రారంభించిన ఈ అమ్మడు మొదట కొన్ని కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచి సక్సెస్ రావడంతో సినిమాల్లో సైతం అవకాశాలు వచ్చాయి.

రంగస్థలం ,క్షణం, సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం రంగమార్తాండ, కిలాడి, వేదాంతం రాఘవయ్య, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమెపై విపరీతమైన ట్రోల్స్ కామెంట్ చేస్తూ ఉంటారు.

అయితే అప్పుడప్పుడు వారు చేసే కామెంట్లకు ఘాటుగా రిప్లై కూడా ఇస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఒక చేదు సంఘటన గురించి వివరించింది. కొద్ది రోజుల క్రితం ఒకడు కామెంట్ చేశాడు. నువ్వు పడుకోబట్టే ఇండస్ట్రీ లోకి వచ్చావ్ …నువ్వు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అదే కదా అని పెట్టాడు. నిజానికి నేను ఇలాంటివి పెద్దగా పట్టించుకోను. కానీ వాడు చేసిన కామెంట్ కి రిప్లై ఇవ్వాలని అనుకున్నాను.

అందుకే నేను కూడా రిప్లై ఇచ్చాను. మీ ఇంట్లో వాళ్ళు అంతేనా అని రిప్లై పెట్టాను. వెంటనే వాడు కామెంట్ ను డిలీట్ చేశాడు. ఇక అప్పటి నుంచీ కూడా ట్రోల్స్ చేసే వాళ్లకి కౌంటర్ ఇస్తేనే వాళ్లు కూడా సైలెంట్ అవుతారని డిసైడ్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.

Advertisement

తాజా వార్తలు

Advertisement