Friday, October 18, 2024

Anasuya | నీ సొగ‌సు చూడ‌త‌ర‌మా..

తెలుగు బుల్లితెరపై యాంకర్‌‌గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ అనసూయ. క్షణం సినిమాతో వెండితెరపైకి నటిగా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే విమర్శకులు ప్రశంసలు సొంతం చేసుకుంది. రామ్ చరణ్ రంగస్థలం సినిమా అనసూయకి ఏకంగా స్టార్ యాక్టర్ గా ఇమేజ్ తీసుకొచ్చింది.

ఆ తర్వాత నటిగా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. పుష్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించిన అనసూయ ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ మూవీలో కూడా నటిస్తొంది. అలాగే మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళింది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను అనసూయ ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ ఫోటోలలో చక్కని చీరకట్టుతో అందంగా ముస్తాబై అనసూయ కనిపించడం విశేషం. ఆమె లుక్స్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement