తాజాగా, మరో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌కి సంబంధించిన AI జెనరేటెడ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఇటీవల రణవీర్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. అక్కడి నమోఘాట్ దగ్గర ఆయనతో కలిసి నటి కృతిసనన్ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు.
అంతకుముందు కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. అనంతరం ఆధ్యాత్మిక నగరంలో తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు వివరించారు. ఆ దృశ్యాలను ఉపయోగించి ఏఐ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆయన ఓ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లు కనిపించింది. మరి ఈ వీడియోపై రణవీర్ సింగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
కాగా, ఇటీవలే అమీర్ ఖాన్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నానని.. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.