తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుమిల్లి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన కార్యదర్శి ఎన్నికల్లో అమ్మిరాజు గెలుపొందారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో గోహెంకి శ్రీనివాస్, వెంకట్ కృష్ణ పోటీ చేయగా.. అమ్మిరాజు 35 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ వల్లభనేని, కార్యదర్శిగా అమ్మిరాజు, కోశాధికారిగా సురేష్ ఉన్నారు.
ఈ సందర్భంగా అమ్మిరాజు మాట్లాడుతూ.. తనను కార్యదర్శిగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమలోని కార్మికులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.