Saturday, July 6, 2024

AMKDT | కల్కి దెబ్బ‌కు బాలీవుడ్ మూవీ రిలీజ్ లు వాయిదా…

పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. వసూళ్ల పరంగా కూడా కల్కి సినిమా దుమ్ము లేపుతోంది. ఇప్పటికే 680 కోట్ల వసూలను రాబట్టిన సినిమా ఈ వారం చివరకు వేయి కోట్ల మార్కును దాటేసే దిశగా కలెక్షన్లను రాబడుతోంది. ఇకపోతే నార్త్‌ ఇండియాలో కూడా కల్కి తన ప్రదర్శనలను బాగానే కొనసాగిస్తోంది.

ఈ దెబ్బకు బాలీవుడ్ లో రిలీజ్ కావాల్సిన ఓ స్టార్ హీరో సినిమా వాయిదా పడింది. హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ టబు జంటగా నటించిన చిత్రం “అరూన్ మైన్ కహాన్ దామ్ తాషా. ఈ సినిమా జూలై 5న విడుదల కావాల్సి ఉండ‌గా.. వచ్చే వారానికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రకటించారు. నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, NH స్టూడియోస్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement