యంగ్ హీరో సంతోష్ శోభన్ కి ఈ మధ్య కాలంలో అసలు కలిసి రావడం లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన ఏక్ మినీ కథతో సంతోష్ కాస్త లైమ్‌లోకి వచ్చాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఫ్లాపుల బాట పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బ్యాక్ టు బ్యాక్ నాలుగు ఫ్లాపులు పలకరించాయి. పైగా అన్నీ పేరున్న సంస్థలలోనే సంతోష్ శోభన్ సినిమాలు చేశాడు. కానీ హిట్లు మాత్రం వరించడం లేదు. భారీ ఆశలు పెట్టుకున్న అన్ని మంచి శకునుములే సైతం తొలి రోజే మిక్స్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ ఫలితం మూటగట్టుకుంది. ఈ సారి నందిని రెడ్డి కూడా సంతోష్‌ను కాపాడలేక పోయింది. టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి హైప్‌నే తీసుకొచ్చినా.. జనాలను మాత్రం థియేటర్లకు రప్పించలేకపోయాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా జూన్ 17న స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుంది. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement