కోలివుడ్ నటి అమలా పాల్ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి జీవితానికి ఓకే చెప్పింది. అమలా పాల్ బర్త్ డే రోజు.. ఆమే బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ఆమెకు ప్రపోజ్ చేయడం, ఆమె వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయింది. ఇక ఇలా ప్రపోజల్ కి ఒకే చెప్పిందో లేదో వెంటనే పెళ్లి పీటలు ఎక్కేసారు. కోచిలో ఇవ్వాల (నవంబర్ 5న) వీరిద్దరి వివాహం జరిగింది. పెళ్లి ఫోటోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు అమలాపాల్ అండ్ జగత్ దేశాయ్..
అమలాపాల్ కి ఇది రెండో పెళ్లి. 2014 లో డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. విభేదాల కారణంగా 2017 లో అతడి నుంచి విడిపోయింది. ఇక కొన్నాళ్లుగా జగత్ దేశాయ్‌తో డేటింగ్ చేస్తున్న ఈ భామ.. అతడితో ఉన్న ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లి కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. కాగా ఈ జంటకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.