Saturday, November 23, 2024

అల్లు శిరీష్ మోటివేషన్ మాములుగా లేదుగా

ఈమధ్య తన ఫిట్ నెస్ తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు అల్లు శిరీష్. తన కొత్త సినిమా కోసం పూర్తిగా తన బాడీనే మేకోవర్ చేశాడు. అయితే తాజాగా తన ఫిట్నెస్ కు సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు శిరీష్. ఫిట్ గా ఎలా ఉండాలి అనే విషయాన్ని చెబుతూ తన వర్కౌట్స్ ఎలా నడుస్తున్నాయి ఫిట్నెస్ కోసం ఆయన ప్రయాణం గురించి ఓ వీడియోను విడుదల చేశారు.

దీనికి నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి వీడియోలో బ్యాక్ వర్కౌట్స్ గురించి చూపించారు శిరీష్. జిమ్ లో ఎంత కష్టపడ్డాడు అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. 30 సెకన్ల వీడియోకు సంబంధించి చాలా అంశాలను ఈ వీడియోలో చూపించారు శిరీష్.

https://www.instagram.com/reel/CQaSbI2FIx_/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement