Saturday, November 23, 2024

పిల్లలపై తండ్రి ప్రేమ…అల్లుఅర్జున్ వైరల్ వీడియో !!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చేసుకున్న కరోనా పరీక్షలలో అల్లు అర్జున్ కు నెగిటివ్ వచ్చింది. కాగా ఇన్ని రోజులు కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ పదిహేను రోజుల తర్వాత కుటుంబాన్ని కలిశాడు. మాములుగా బన్నీకి తన కుటుంబం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికినా పిల్లలతో ఆడుతూ పాడుతూ సమయాన్ని గడుపుతూ ఉంటాడు.

ఇక ఈ గ్యాప్ తర్వాత బన్నీ తన ఇద్దరు పిల్లల్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బన్నీ తన పిల్లలని ఎంతలా మిస్ అయ్యాడో ఆ వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement