స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ప్రస్తుతం ఫిలిమ్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమాలను అనౌన్స్ చేశారు.
కాబట్టి ఈ ఇద్దరితో ఇప్పుడప్పుడే సినిమాలు చేసేటట్టు కనిపించట్లేదు. కాగా తాజాగా బోయపాటి శ్రీను పేరు తెరపైకి వచ్చింది. బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ తో అఖండ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే అల్లుఅర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు చిత్రం సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో కొత్త సినిమా అంటూ వార్తలు రావడంతో అభిమానులలో మంచి జోష్ ను తీసుకొచ్చింది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.