అలియాభట్ చీర కట్టిందంటే? ఆ చీరకే వన్నె తెచ్చేస్తుంది. అంతటి అందం ఆమె సొంతం అనడంలో అతిశయోక్తిలేదు. అందుకే అమ్మడు సంప్రదాయ వేడుకల్లో అంతే ట్రెడీషనల్ గా ముస్తాబవుతుంటుంది. ప్రత్యేకమైన ఈవెంట్లకు హాజరైనా చీరలో ప్రత్యేకతను వివిధ రూపాల్లో చాటుతుంది.
బాలీవుడ్ లో ఈ టెక్నిక్ తెలిసిన ఏకైన నటి అలియాభట్. చీరలతో ఫోజులిచ్చిన భామలు చాలా మంది ఉంటారు. కానీ ఆ చీర ప్రత్యేక గురించి…దానికో చరిత్ర ఉంటుందని చెప్పగలిగేది మాత్రం అలియాభట్ మాత్రమే. చీరలో అంతటి నేచురాల్టీని కోరుకుంటుంది. తాజాగా మరోసారి అమ్మడు అలాంటి మెరుపులే మెరిపించింది. గత రాత్రి లండన్ హోప్ గాలా 2024ని ఆర్కైవల్ ఈవెంట్ ని అలియాభట్ ఎంతో అద్భుతంగా హోస్ట్ చేసింది. ఆ ఈవెంట్కి భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు. సంతోషమంతా తనకే సొంతం అన్నట్లు ఎంతో ఉత్సాహంగా కనిపించింది.
అన్నింటిని మించి అమ్మడు ధరించిన చీర మాత్రం ఈవెంట్ కే హైలైట్ గా నిలిచింది. ఈవెంట్ కి వచ్చిన వారంతా అలియా చీర గురించే చర్చించుకున్నారంటే? అతిశయోక్తి కాదు. ఆ చీర ప్రత్యేకత అలాంటిది మరి. అలియా ధరించిన చీర అసామాన్యమైనది. ఆ చీరకు మూడు దశాబ్ధాల కాలం నాటి ఓ చరిత్ర ఉందని తాజాగా వెలుగులోకి వస్తుంది. క్రీమ్ కలర్ సారీ అండ్ బ్లౌజ్ లో అలియా ఎంతో అందంగా కనిపించింది. ముఖ్యంగా ఆ చీర డిజైన్ అద్భుతంగా ఉంది. ఆ చీర ప్రత్యేకత గురించి చూస్తే… మూడు దశాబ్ధాల క్రితం నాటి డిజైన్ అది. 3500 గంటల పాటు కరింగార్లతో ఆ చీరను తయారు చేయడానికి సమయం పట్టింది. ఈ ఐవరీ ఫ్లవర్ రేషమ్ చీర అనేది సిల్క్ థ్రెడ్‌లను వివిధ రకాల కుట్లుతో ఎంబ్రాయిడరీ వర్క్ తో కూడినది. ఫ్యాబ్రిక్‌లో అద్భుతమైన డైమెన్షన్‌ను ప్రేరేపించడానికి ఎంతో దోహదం చేస్తుంది. ఆ అందానికి అలియా బ్యూటీ తోడయ్యే సరికి మరింత ఆకర్షణీయంగా మారింది.