Tuesday, November 26, 2024

ఏడాది త‌రువాత ముద్దుల కూతురితో ఆలియా-రణ్‌బీర్ దంపతుల ఫోటో

బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్, రణ్‌బీర్‌కపూర్‌ గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది ఏప్రిల్‌ 14న పెళ్లిబంధంతో ఒక్కటైన వీరు.. 2022 న‌వంబ‌ర్ 6న‌ రాహా అనే కూతురు జన్మించ్చారు. అలియా తల్లై ఏడాది గడిచిన ఇప్పటికీ కూతురిని మాత్రం రిచయం చేయలేదు. ఫైనల్‌గా రాహాను నేరుగా మీడియా ముందుకు తీసుకువచ్చారు అలియా-రణ్‌బీర్.

తాజాగా క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఈ జంట ఎట్టకేలకు తమ కూతురి మొహాన్ని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. తమ ఇంటి వద్దకు విచ్చేసిన మీడియా ప్రతినిధులకను పలకరిస్తూ కుమార్తెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాహా చాలా క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement