మెట్ గాలా 2024 ఈవెంట్ కన్నులపండుగను తలపిస్తోంది. ఈ వేదికపై బాలీవుడ్ అందగత్తెలు తళుకుబెళుకుల ప్రదర్శన చర్చగా మారింది. తాజా ఈవెంట్లో ఆర్.ఆర్.ఆర్ సీత ఆలియా భట్ ఎంతో అందంగా ముస్తాబై ప్రత్యక్షమైంది. ఈ వేడుక కోసం ఆలియా ఎంపిక చేసుకున్న ఆ స్పెషల్ డిజైనర్ చీరపైనే అతిథుల కళ్లన్నీ. అంతగా ఆ చీరలో ఏం ప్రత్యేకత ఉంది? అంటే.. వివరాల్లోకి వెళ్లాలి.
అందాల ఆలియా భట్ ఇటీవల వరుస ఫోటోషూట్లతో అభిమానులకు ట్రీటిస్తోంది. తాజాగా మెట్ గాలా ఈవెంట్లో ఆలియా స్టన్నర్ లుక్ తో మైమరిపించింది. అందమైన ఫ్లోరల్ శారీ.. షోల్డర్ లెస్ టాప్ లో ఆలియా స్మైలిస్తూ దర్శనమిచ్చింది. న్యూయార్క్ స్కైలైన్‌ను తాకే తీరుగా రూపొందించిన ఈ సిల్హౌట్ స్నాప్‌షాట్ లను ఆలియా షేర్ చేసింది. మెట్ గాలా ఫ్యాషన్ కోలాహలంలో చీరలో కనిపించి భారతీయులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది ఆలియా.
భారతదేశంలో అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న డిజైనర్లలో ఒకరైన సబ్యసాచి ముఖర్జీ రూపొందించబడిన చీర ఇది. ఈ అద్భుతమైన చీరను సిద్ధం చేసేందుకు 1,905 పనిగంటలు.. 163 మంది కళాకారుల నైపుణ్యం అవసరమైంది. పల్లుతో పాటు క్లిష్టమైన పూల ఎంబ్రాయిడరీ క్యాస్కేడింగ్ కి ఈ చీర డిజైన్ లో ప్రాధాన్యతనిచ్చారు. మెట్ గాలాలో అలియా ఉనికి ప్రపంచ స్టైల్ ఐకాన్ హోదాను ప్రతిబింబించింది.