నటుడు అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. దాంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అలీ ఒక వీడియో విడుదల చేశారు. తాను 1999లో రాజకీయాల్లో అడుగు పెట్టానని అన్నారు.
ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను, ఏ పార్టీకి మద్దతుదారుని కాదు అని అలీ స్పష్టం చేశారు. ఇక నుంచి నా సినిమాలు, నా షూటింగ్‌లు నేను చేసుకుందామని అనుకుంటున్నాను…. ఈ విషయం చెప్పడానికే మీ ముందుకు వచ్చానని వీడియోలో పేర్కొన్నాడు. మీలాగే సామాన్యుడిలా ఐదేళ్లకు ఒకసారి వెళ్లి ఓటేస్తానని, ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని ఆయన అన్నారు.