బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారు. ఈ నెల 4వ తేదీన అక్షయ్ కుమార్ కి కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరాడు. వారం రోజుల తరువాత నిన్న అక్షయ్ కి ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని అతని భార్య ట్వింకిల్ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పింది. తనకు కరోనా నెగటివ్ వచ్చిందా లేదా అన్న విషయాన్ని అక్షయ్ ఇంకా చెప్పకపోయినా.. ట్వింకిల్ పోస్ట్ చూస్తే అతడు పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోంది. తనది, అక్షయ్‌కు చెందిన ఓ క్యారికేచర్‌ను ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అంతా బాగుంది. అతడు తిరిగి ఇంటికి రావడం సంతోషంగా ఉంది అని ట్వింకిల్ కామెంట్ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement