అఖండ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వడంతో హీరో నందమూరి బాలకృష్ణ తన నెక్ట్స్ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. కాగా అఖండ చిత్రం ఎప్పుడు రిలీజ్ కానుందనే విషయంపై సందిగ్థత నెలకొంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ లేట్ అవుతుండటం వల్ల ఫ్యాన్స్ నిరాశకి గురవుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం చిత్ర టీమ్ అఖండ విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు సమాచారం. డిసెంబర్ 2 న విడుదల చేయాలని మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఈ వారంలోనే రిలీజ్ డేట్ పోస్టర్ తో అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని దీపావళి రోజున ప్రకటన చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.దాంతో అప్పటి నుంచే ఈ చిత్ర ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.
ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నాయి. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. సూపర్ హిట్టైన ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మాత. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కలయికలో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత బాలకృష్ణ చేయనున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు.