Friday, October 18, 2024

AKHANDA 2 బడ్జెట్ అన్ని కోట్లా..!

నందమూరి నటసింహం బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘అఖండ’ మూవీ అయితే బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘అఖండ తాండవం’ బోయపాటి గతంలో ఎనౌన్స్ చేశారు.

తాజాగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. బాలయ్య, ప్రగ్యా జైశ్వాల్ పై ముహూర్తం షాట్ షూట్ చేశారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండటం విశేషం. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ చిత్రంతో నిర్మాతగా అడుగుపెడుతోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంటతో కలిసి తేజస్విని ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉంది.

బాలయ్య మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి 120 నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంటే బాలయ్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కనుంది.

కచ్చితంగా ఇది షాక్ ఇచ్చే న్యూస్ అని చెప్పొచ్చు. స్పిరిచ్యువల్ ఎలివేషన్ అండ్ మాస్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం కథ ఉండబోతోంది. ఈ సినిమాని సంక్రాంతి రేసులో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ‘అఖండ 2: తాండవం’ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలు కాబోతోందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement