Saturday, November 23, 2024

సీతగా మాజీ ప్రపంచ సుందరి ?

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ సీత కోణంలో ఓ కథను రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో సీత పాత్రలో మొదట కరీనా కపూర్ ను అనుకున్నారట దర్శక నిర్మాతలు. అయితే కరీనా అందుకు రెమ్యూనరేషన్ భారీ మొత్తంలో డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గిపోయారట. ఆ తర్వాత సోషల్ మీడియాలో కొత్తగా కంగనా రనౌత్ పేరు తెరపైకి వచ్చింది. అయితే మార్కెట్ కంగనా కు ఎక్కువగా ఉండటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

కానీ మేకర్స్ మాత్రం కంగనతో సినిమా చేయడానికి సిద్ధంగా లేరట. ఈ నేపథ్యంలోనే తాజాగా తెరపైకి ఐశ్వర్య రాయ్ పేరు వచ్చింది. ఇప్పటికే ఐశ్వర్య రాయ్ ను తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఐశ్వర్య రాయ్ అయితే ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ వుంటుందని భావిస్తున్నారట. మరి ఫైనల్ గా సీతగా ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement