మీ నేపథ్యం ఏమిటీ?
మాది మధ్య ప్రదేశ్, జబల్పూర్. గ్రాడ్యుయేషన్ తర్వాత కెరీర్ మొదలు పెట్టాను. మొదట కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. తర్వాత సినిమాల్లోకి రావాలకున్నా . నాకు టాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆడిషన్స్ ఇచ్చే క్రమం లో తేజ గారిని కలిశాను. ఆడిషన్స్ ఇచ్చాను, ఎంపికయ్యాను.
కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
తేజ గారు మొదట నాకు కథ మొత్తం చెప్పలేదు. నేను చేసిన అహల్య పాత్ర గురించి చెప్పారు. చాలా కీలకమైన పాత్ర. తను చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. ఆ పాత్ర ప్రయా ణం నాకు చాలా నచ్చింది. ఛాలెంజింగా అనిపించింది.
అభిరామ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించిది ?
అభిరామ్ మల్టీ టాలెం-టె-డ్. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తేజగారు ఎన్ని టేక్స్ తీసుకున్నా సరే.. పెర్ఫెక్ట్ గా వచ్చే వరకు చాలా ఓపికతో వుంటారు. అభిరామ్ గుడ్ కోస్టార్.
ఆర్పీ పట్నాయక్ గారి మ్యూజిక్ గురించి ?
అహింసలో వండర్‌ఫుల్ మ్యూజిక్ వుంది. ఇందులో నాలు గు పాటలున్నాయి. పాటలన్నీ చాలా బావొచ్చాయి. ఇందు లో నీతోనే నీతోనే పాట నా ఫేవరేట్. నాకు డ్యాన్స్ అంటే ఇ ష్టం.
అహింసలో మిగతా నటీ-నటు-లు గురించి ?
అహింసలో సదా గారు అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారు. చాలా బలమైన పాత్ర. అలాగే రజత్ బేడీ, మనోజ్ -టైగర్ బల మైన ప్రతినాయకులుగా కనిపిస్తారు.
షూటింగ్ గ్రామాల్లో జరిగిందా ?
అహింస షూటింగ్ 90 శాతం మధ్య ప్రదేశ్ లోని అడవీ ప్రాంతంలో జరిగింది. చాలా ఇం-టె-న్స్ లోకేషన్స్ కనిపిస్తా యి. యూనిట్ అంతా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.
Ahimsa – చాలా కీలకపాత్రలోనటించా….గీతికా తివారి
Advertisement
తాజా వార్తలు
Advertisement