వివాదాలకి కేరాఫ్ గా నిలుస్తుంటారు బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్.. ఎమర్జెన్సీ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో థియేటర్ల ముందుకు రానుంది. కాగా రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ఎక్సర్ సైజ్ లు స్టార్ట్ చేసింది. యాక్షన్ పాత్రల్లో సులువుగా ఒదిగిపోయేందుకు వీలుగా కఠినంగా సాధన చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిందిఇన్ స్టాలో కంగనా షేర్ చేసిన వీడియోను చూస్తే, ఆమె ఎంతలా సాధన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
బ్లాక్ స్పోర్ట్స్ సూట్ వేసుకున్న ఆమె జిమ్ లో ఇన్ స్ట్రుమెంట్లతో కసరత్తు చేస్తోంది. 36 ఏళ్ల వయసులోనూ ఆమె చలాకీగా చేస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. రోజువారీ ఎక్సర్ సైజులకు విరామం చెప్పిన రెండేళ్ల తర్వాత.. నా రోజువారీ ఫిట్ నెస్ సు ప్రారంభించాను. రానున్న యాక్షన్ సినిమా ద్వారా గొప్ప పరివర్తన కోసం ఎదురు చూస్తున్నాను’ అని పోస్ట్ పెట్టింది. దీనికి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తొలిగా స్పందించారు. నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావు. నీవు విజయం సాధించాలి అంటూ కామెంట్ చేశారు. కఠోర సాధనను అభిమానులు సైతం మెచ్చుకుంటున్నారు.