కొన్ని రోజుల క్రితం సుస్మితాసేన్ హార్ట్ ఎటాక్ కి గురయింది. అయితే సకాలంలో సర్జరీ జరగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. తిరిగి నార్మల్ లైఫ్ లోకి వస్తున్నారు. తాజాగా సుస్మితా సేన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన దృశ్యాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నటి సుస్మితా సేన్ గతంలో తన కంటే వయసులో ఎంతో చిన్నవాడైన రోహ్మన్ షాల్ అనే యువకుడితో ప్రేమాయణం సాగించడం సంచలనం సృష్టించింది. రోహ్మాన్ తో సుస్మితా సీక్రెట్ గా ఏమీ ఎఫైర్ నడపలేదు. అఫీషియల్ గానే ఇద్దరూ కొంతకాలం రిలేషన్ లో ఉన్నారు.
ఆ దృశ్యాలని కూడా సుస్మితా పలుమార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ కొన్ని నెలల క్రితం విడిపోయారు. జిమ్ దృశ్యాల్ని పోస్ట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సంకల్పం ఒక్కటే మార్గం.. ఇప్పుడు మరిన్ని వర్కౌట్స్ చేయగలుగుతున్నా. మరికొన్ని రోజుల్లో ఆర్య పార్ షూటింగ్ లో పాల్గొంటా. రొహ్మన్ నాకు కంపెనీ ఇస్తూ సహాయం చేస్తున్నాడు. రోహ్మాన్ కి, అలీషాకి నా ముద్దులు అంటూ మాజీ ప్రియుడు గురించి, తన కుమార్తె గురించి సుస్మితా పోస్ట్ పెట్టింది. కాగా హార్ట్ సర్జరీ జరిగిన కొన్ని రోజులకే ఆమె జిమ్ లో ఎంతో రిస్క్ తో కూడుకున్న వర్కౌట్స్ చేస్తోంది. దీనితో నెటిజన్లు, అభిమానులు జాగ్రత్త వహించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సుస్మితా సేన్ వైద్యుల సలహా మేరకే జిమ్ వర్కౌట్స్ చేస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే సుస్మితా సేన్ తో కలసి ఆమె మాజీ ప్రియుడు రోహ్మన్ కూడా వర్కౌట్స్ చేస్తున్నాడు. తన మాజీ ప్రియుడు సహకారంతోనే తాను ఇలా నార్మల్ అవుతున్నట్లు.. జిమ్ వర్కౌట్స్ లో పాల్గొంటునట్లు సుస్మితా పేర్కొంది.