Tuesday, November 26, 2024

24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్న డాక్టర్లు.. విషమంగానే కృష్ణ ఆరోగ్యం

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. మీడియాతో డాక్టర్లు మాట్లాడుతూ.. ‘‘సీనియర్​ నటుడు కృష్ణ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిడ్నీ, లివర్, లంగ్స్‌ కొంతవరకు దెబ్బతిన్నాయి. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా భావిస్తున్నాం. కిడ్నీ ఫెయిల్యూర్‌ కారణంగా డయాలసిస్‌ చేస్తున్నాం”అన్నారు.

ఇక.. కార్డియాలజిస్ట్‌, న్యూరాలజిస్ట్‌, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులతో కూడిన 8 మంది డాక్టర్ల బృందం నటుడు కృష్ణకు చికిత్స కొనసాగిస్తోంది. మిగితా అవయవాల పనితీరు మందగించిందని, 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ఉదయం నుంచి హెల్త్​ కండిషన్​లో ఎట్లాంటి మార్పు లేదని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని తెలిపారు. అయితే.. పరిస్థితు గురించి ఇప్పడే ఏం చెప్పలేం. ప్రస్తుతానికి నిలకడగానే ఆరోగ్యం ఉందంటున్నారు. అయినా.. పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేపు మధ్యాహ్నం 1 గంటకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామని డాక్టర్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement