సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మీడియాతో డాక్టర్లు మాట్లాడుతూ.. ‘‘సీనియర్ నటుడు కృష్ణ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిడ్నీ, లివర్, లంగ్స్ కొంతవరకు దెబ్బతిన్నాయి. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా భావిస్తున్నాం. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా డయాలసిస్ చేస్తున్నాం”అన్నారు.
ఇక.. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులతో కూడిన 8 మంది డాక్టర్ల బృందం నటుడు కృష్ణకు చికిత్స కొనసాగిస్తోంది. మిగితా అవయవాల పనితీరు మందగించిందని, 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ఉదయం నుంచి హెల్త్ కండిషన్లో ఎట్లాంటి మార్పు లేదని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని తెలిపారు. అయితే.. పరిస్థితు గురించి ఇప్పడే ఏం చెప్పలేం. ప్రస్తుతానికి నిలకడగానే ఆరోగ్యం ఉందంటున్నారు. అయినా.. పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేపు మధ్యాహ్నం 1 గంటకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని డాక్టర్లు చెప్పారు.