Wednesday, September 18, 2024

Adivi Sesh | గూఢాచారి స్ట‌న్నింగ్ స్టిల్స్…

వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గూఢచారి 2. ఆరేళ్ళ క్రితం విడుదలైన ‘గూఢచారి’కి సీక్వెల్ ఇది. కాగా, ‘గూఢచారి’ విడుదలై ఆరేళ్లు పూర్తి అయిన సందర్భంగా #G2 నుంచి కొన్ని స్టిల్స్ విడుదల చేసి అభిమానులను థ్రిల్ చేశారు హీరో అడివి శేష్.

టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా… ‘జీ 2’ షూటింగ్ దాదాపు 40 పర్సెంట్ కంప్లీట్ అయ్యిందని దర్శక నిర్మాతలు తెలిపారు. వచ్చే ఏడాది వేసవి తర్వాత ‘జీ 2’ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement