కోలీవుడ్ నటి వనితా విజయకుమార్ నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో నటి వనిత విజయ్ కుమార్ మరోమారు పెళ్లి చేసుకుందని ఇండస్ట్రీలో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ ఫోటోలపై తాజాగా స్పందించింది వనిత విజయ్‌కుమార్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు తమ పెళ్లి ఫొటోలు కాదని చెప్పింది. పవర్‌స్టార్ దర్శకత్వంలో తాను నటిస్తున్న పికప్ డ్రాప్ అనే చిత్రానికి సంబంధించిన ఫొటోలని వివరణ ఇచ్చింది.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో పాటు నెటిజన్లపై మండిపడింది. ఇద్దరు నటీనటులు కలిసి ఫొటోలు తీసుకుని, వాటిని విడుదల చేస్తే పెళ్ళి జరిగినట్టా? ఇలాంటి విషయాలను చర్చనీయాంశం చేయాల్సిన అవసరం లేదు.
పైగా వ్యక్తిగత జీవితంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రం అవసరం. ఒక పురుషుడు నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ రాద్దాంతం చేయరు. ఆ పని ఒక మహిళ చేస్తే మాత్రం వివాదం సృష్టిస్తారు. నేను నాలుగు కాదు… 40 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటాను. అది నా హక్కు. మహిళల గురించి ఈ సమాజం ఇంకా చెడుగా మాట్లాడుతుండటం వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఒకరితో జీవితాన్ని పంచుకుంటూ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే తప్పు. ఈ మాట ఎందుకు చెపుతున్నానో మీకై అర్థమైవుంటుంది. అలాగే, నాకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదు అని వనితా విజయకుమార్ స్పష్టం చేసింది. అలాగే, పవర్‌స్టార్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, ఈ సమాజంలో నూటికి 90 మంది సక్రమైన మార్గంలో పయనించడం లేదు. ఇవన్నీ బయటకు చెప్పకుండానే రహస్యంగా జీవిస్తున్నారు. కానీ, వనితా విజయకుమార్ మాత్రం ఒక ఐరెన్ లేడీ అని అని కితాబిచ్చారు.
ఇది కూడా చదవండి: త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కత్తి కార్తీక?