Tuesday, November 19, 2024

Bollywood : త‌ల్లి కాబోతున్న న‌టి స్వ‌ర‌భాస్క‌ర్.. వైర‌ల్ గా ఫొటోస్

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు బాలీవుడ్ న‌టి స్వ‌ర భాస్క‌ర్.. ఫ‌హాద్ అహ్మ‌ద్. కాగా వీరు త‌మ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ని అందించారు. త్వరలో తల్లి కాబోతుంది బాలీవుడ్ న‌టి స్వ‌ర‌భాస్క‌ర్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది. ఈ మేరకు ప్రెగ్నెన్సీ అనంతరం భర్త ఫహాద్‌ అహ్మద్‌తో కలిసి దిగిన ఫొటోలను స్వరభాస్కర్‌ ట్విటర్‌లో షేర్ చేసింది. ఫొటోలతోపాటు సమ్‌ టైమ్స్‌ ఆల్‌ యువర్‌ ప్రేయర్స్ ఆర్‌ ఆన్సర్డ్‌ ఆల్‌ టుగెదర్‌.. బ్లెస్స్‌డ్, గ్రేట్‌ఫుల్‌, ఎక్జైటెడ్‌, ఆజ్‌ వుయ్‌ స్టెప్‌ ఇన్‌టు ఎ హోల్‌ న్యూ వరల్డ్‌’ అనే ట్యాగ్‌లైన్‌ ఇచ్చింది. ట్యాగ్‌లైన్‌తోపాటు కమింగ్‌ సూన్‌, ఫ్యామిలీ, న్యూ అరైవల్‌, గ్రాట్యిటూడ్‌, అక్టోబర్‌ బేబీ అనే హ్యాష్‌ టాగ్‌లను కూడా స్వరభాస్కర్‌ తన ట్వీట్‌కు జతచేసింది. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్‌ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement