ఇటీవల రజనీకాంత్ తన హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అమెరికాలోకి విదేశీయులను అనుమతించటంలేదు. కానీ ప్రత్యేక అనుమతులు తీసుకుని రజినీకాంత్ అమెరికా వెళ్లారు. కాగా అమెరికా వెళ్లిన రజనీకాంత్ పై నటి కస్తూరి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కస్తూరి పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రజనీకాంత్ సార్ అమెరికాకు సడన్ గా వెళ్ళటం పై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని.. ఎవరికి అనుమతులు దొరకని సమయంలో రజినీకాంత్ కు ఎలా అనుమతి లభించిందని ప్రశ్నించింది కస్తూరి. జనరల్ చెకప్ కోసం భారత్ నుంచి అనుమతి తీసుకొని మరి ఎందుకు వెళ్లినట్టు అంటూ ప్రశ్నించింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అమెరికా పర్యటనకు వెళ్లడం తనకు అనుమానాలు వస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వివాదంగా మారింది.