Friday, November 22, 2024

ప్రేమలో పడ్డ సీనియర్ నటి

నటి సురేఖ వాణి… తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. హీరో హీరోయిన్లకు అక్కగా, తల్లిగా ఎన్నో పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. సినిమాలలో చీర కట్టుకొని ఎంతో సాంప్రదాయంగా కనిపించే సురేఖ రియల్ లైఫ్ లో కొద్దిగా ట్రెడిషనల్ గా ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె కూతురు సుప్రియ తో పొట్టి పొట్టి దుస్తులు వేస్తూ సందడి చేస్తూ ఉంటారు.

అప్పుడప్పుడు వీరికి అల్లరికి నెటిజన్స్ ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తన పోస్ట్ వైరల్ గా కూడామారింది. అది మరేదో కాదు… తాను ప్రేమలో ఉన్నానని చెప్పింది. అయితే ఆ ప్రేమ వ్యక్తులపై కాదట. ఆమె మెడలో ధరించిన నెక్లెస్‌తోనట. ఈ విషయాన్ని సురేఖవాణి చెబుతూ ఆ నెక్లెస్ తో ప్రేమలో ఉన్నానని పేర్కొంది. ప్రస్తుతం సురేఖ పెట్టిన పోస్ట్ లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement