కరోనా కష్టకాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సంజన కూడా తన వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు అలాగే కోలీవుడ్ సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలని వారిలో సానుకూల ఆలోచనలు రావాలని ఆకాంక్షిస్తున్నాను. కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ తో పాటుగా భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాస్కులు ధరించండి. శానిటైజర్స్ వాడండి… భౌతిక దూరం పాటించండి అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా ఉడతాభక్తిగా మే 10 నుండి ప్రతిరోజు వంట వండి 500 మందికి రెండు పూటలా వెజిటేబుల్ బిర్యానీ, పెరుగన్నం, పులిహోర ,ఇలా రోజు మెనూ మారుస్తూ పేదవారికి ఆహారం అందిస్తున్నాను అని లాక్ డౌన్ కారణంగా రోజువారి కూలి చేసే సినీ పరిశ్రమకు చెందిన లైట్ బాయ్స్, ఫోర్త్ క్లాస్ కార్మికుల 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను జూన్ 2న అందించానని… భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ సహకారాలను కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు సంజన.