నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసిన చెన్నై పోలీసులు.. ఇప్పుడు ఆమెను చెన్నైకి తరలిస్తున్నారు.
కాగా, నటి కస్తూరి ఇటీవల తమిళ నాయకులను విమర్శిస్తూ 300 సంవత్సరాల క్రితం తమిళ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్ళే తెలుగు వాళ్ళు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ద్రవిడ సిద్ధాంత వాదులపై ఫైర్ అవుతూ బ్రాహ్మణులకు సపోర్ట్ గా మాట్లాడుతుండగా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి వివాదాస్పదంగా మారాయి. దీంతో పలుచోట్ల కస్తూరిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులపై కస్తూరి అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు ఆశ్రయించగా దానిని హైకోర్టు కొట్టేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లగా ఆమె ఇంటికి తాళం వేసింది. ఆమె పరారీలో ఉందని తెలుసుకున్న పోలీసులు… రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు హైదరాబాద్‌లో నటి కస్తూరి ఆచూకీ లభ్యం కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి చెన్నైకి తరలిస్తున్నారు.