5జీ టెక్నాలజీని వ్యతిరేకిస్తూ బాలీవుడ్ నటి జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. కాగా 5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదం ఉందని…. పౌరులకు ఎలాంటి హానీ జరగదని ప్రభుత్వం ధ్రువీకరించే వరకు ఆ టెక్నాలజీ ని ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు జుహీ చావ్లా. అయితే కోర్టు మాత్రం దీనిని అప్ గ్రేడ్ చేయాల్సిందేనని పిటిషన్ ను తిరస్కరించింది.
అంతే కాకుండా దాని పై ఏవైనా సందేహాలు ఉంటే ప్రభుత్వానికి ముందు లేఖ రాసి ఉండాల్సిందని కోర్టు తెలిపింది. ఇదంతా బాగానే ఉంది. అసలు విషయం ఇక్కడే మొదలైంది. జుహీ చావ్లా అభిమాని ఒకరు వాదనలు జరుగుతున్న సమయంలో సినిమా పాటలు వినిపించడంతో పాటు కోర్టు ప్రొసీడింగ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పై ఢిల్లీ హైకోర్టు జుహీ చావ్లా పై సీరియస్ అయింది. జుహీ చావ్లా కు 20 లక్షలు జరిమానా విధించింది.