నటి హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. మొదట సీరియల్స్ లో నటించి మెప్పించిన హరితేజ అ ఆ సినిమాతో వెండితెరపై కూడా తన కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగ్ లతో అందరినీ కడుపుబ్బ నవ్వించింది. తరువాత బిగ్ బాస్ సీజన్ 1 పాల్గొని ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. కాగా 2015 లో హరితేజ వివాహం చేసుకోగా తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నానని గతేడాది సోషల్ మీడియా ద్వారా ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు తెలియజేసింది.
అయితే ఏప్రిల్ 5న ఓ ఆడపిల్లకు హరితేజ జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెబుతూ ఇట్స్ బేబీ గర్ల్ అంటూ తన భర్తతో ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక దీంతో అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.