తౌక్టే తుఫాన్ ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద భారీ నష్టమే జరిగింది. నగరంలోని అనేక ప్రాంతాల్లోనూ చెట్లు కూలాయి. టీవీ నటి దీపికా సింగ్ గోయల్ ఇంటి ముందు కూడా ఓ చెట్టు తుఫాన్ ఈదురుగాలులకు పడిపోయింది. నేలరాలిన ఆ చెట్టు వద్ద.. యాక్ట్రెస్ దీపికా సింగ్ ఫోటోషూట్ చేసింది. ప్రకృతి ప్రకోపాన్ని ఎంజాయ్ చేయాలన్న రీతిలో తన ఇన్‌స్టాలో పోస్టులు పెట్టింది.
తన ఇంటి ముందు రాలిన చెట్టుతో ఎవరికీ ఇబ్బంది కాలేదని దియా ఔర్ బాతి హమ్ సీరియల్లో నటిస్తున్న దీపిక సింగ్ చెప్పింది. వెరైటీ వెరటీ ఫోజుల్లో దీపిక ఫోటో షూట్ చేసింది.కూలిన చెట్టు వద్ద .. దాని కొమ్మలతో రకరకాల ఫోజులిచ్చిందామె.
తుఫాన్‌ను ఆపలేమని, ఆ ప్రయత్నం చేయవద్దు అని, మనం ప్రశాంతంగా మారి, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయాలని తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ఇక తన రెండవ పోస్టుకు కూడా మరో ట్యాగ్ ఇచ్చింది.
తుఫాన్ పోయే వరకు వేచి ఉండడం కాదు అని, ఆ వర్షంలో డ్యాన్స్‌ను చేయాలని చెప్పింది. దీపిక పెట్టిన పోస్టులపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. కొందరు ఆ ఫోటోలకు లైక్ కొట్టగా, కొందరు మాత్రమే తుఫాన్ వేళ ఏమిటీ ప్రవర్తన అన్న రీతిలో స్పందించారు.