వేదం నాగయ్య శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగయ్య మృతి చెందారు. వేదం సినిమాలో సిరిసిల్ల రాములు గా తన నటనతో అందరిని మెప్పించాడు నాగయ్య. ఏకంగా 25 సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఆ తరువాత రాను రాను సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి.
గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఉన్న దేశవరం పేట నాగయ్య స్వస్థలం. సినిమాలలోకి రాకముందు వ్యవసాయం చేసుకునేవారు. ఊర్లో పనులు లేకపోవడంతో కొడుకుతో కలిసి హైదరాబాదులో కూలి పనుల కోసం వచ్చారు. ఒకరోజు ప్రొడ్యూసర్ రాధాకృష్ణ నడుచుకుంటూ వెళ్తున్న నాగయ్య ను చూసి సినిమాలలో నటించే అవకాశం ఇచ్చారు. అక్కడ నుంచే నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఇక వేదం సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా నాగయ్యకు లభించింది.