Saturday, September 7, 2024

కార్తికేయ2 షూటింగ్ కు బ్రేక్…గాయపడ్డ హీరో నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ లో జరుగుతోంది. కాగా ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో నిఖిల్ కాలికి గాయం అయింది. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ ను నిలిపివేశారు. గాయం తగ్గేవరకు నిఖిల్ యాక్షన్ సన్నివేశాలకు దూరంగా ఉంటారని చిత్రయూనిట్ ప్రకటించింది.

అయితే నిఖిల్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నితిన్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement