Saturday, November 23, 2024

నా తమ్ముడిని డాక్టర్లే చంపేశారు…నటుడు గౌతం రాజు

తెలుగు సినీ నటుడు కమిడియన్ గౌతంరాజు ఇంట్లో విషాదం నెలకొంది. తన సోదరుడు సిద్దార్థ కరోనాతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్దార్దకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే వైద్యం అందక తన సోదరుడు మృతిచెందాడని నటుడు గౌతంరాజు ఆరోపణలు చేశారు. తన తమ్ముడు కరోనా బారిన పడి బెడ్స్ దొరక్క ఎన్నో ఇబ్బందులు పడి హాస్పిటల్ పై నమ్మకంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరారని అన్నారు.

ప్రభుత్వం వైద్య సదుపాయాలు అన్ని కల్పించినప్పటికి వైద్య సేవలు అందించటంలో పెసెంట్లు పై వైద్యులు మానవతా దృక్పథంతో వ్వవహరిస్తాలేదని మండిపడ్డారు. రోగులకు మనోధైర్యాన్ని నింపకుండా మీకు ఒక లంగ్స్ పనిచేయటం లేదు చనిపోతారని పెసెంట్లతో చెప్పటం దారుణమని అన్నారు. మూడురోజులుగా చికిత్స అందించిన వైద్యులు లంగ్స్ దెబ్బతిన్నాయని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆక్సిజన్ తగ్గించేసి నిర్లక్ష్యంగా వదిలేసారని ఆయన అన్నారు.

వైద్యులు తెలిసినవారి రికమెండేసన్ బెడ్స్ కోసం పాత కేసుల ప్రాణాలు తీసి బెడ్స్ కాలిచేయిస్తూన్నారని వైద్యులపై పలు విమర్శలు చేశారు. ఏపిలో చరిత్రకలిగిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి కొంతమంది వైద్యులు వలన చెడ్డ పేరు వస్తూందన్నారు. కరోనా పేషెంట్ కి ఆక్సిజన్ అందిస్తేనే బతుకుతారు, ఆక్సిజన్ పెట్టక పోవటం వలనే మా తమ్ముడుని కోల్పోయానన్నారు.

నేను ఏ రాజకీయ లబ్దికోసం, ఈవిధంగా మాట్లాడటం లేదు.
తెలుగు సినీపరిశ్రమలో నన్ను ఒక నటుడుగా ఎంతగానో ఆదరించారు. మా తమ్ముడుకు జరిగిన అన్యాయం మరోకరికి జరగకూడదనే ఉద్దేశంతో బాధపడి ఈ విధంగా మాట్లాడుతున్నాను. ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పరిస్థితి అలానే ఉంది. బతుకుతామో లేదో గ్యారెంటీ లేదు. భార్యాభర్తలు ఆసుపత్రిలో చేరితే ఇద్దరిలో ఎవరు తిరిగి వస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. అందరూ జాగ్రత్తగా ఉండండి పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయన్నారు గౌతం రాజు.

Advertisement

తాజా వార్తలు

Advertisement