రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, పోలీసులు చార్జిషీటు సమర్పించిన తర్వాత దర్శన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా, దర్శన్ బెయిల్ దరఖాస్తును విచారించిన బెంగళూరులోని 57వ సీసీహెచ్ (సిటీ సివిల్ కోర్టు) కోర్టు… బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది.
కాగా, కోర్టులో దర్శన్ తరఫున సీవీ నగేష్ వాదించారు. దర్శన్‌పై సాక్షులు కల్పితమని నగేష్ వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రసన్నకుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రసన్నకుమార్ వాదన న్యాయమూర్తికి సహేతుకంగా అనిపించడంతో దర్శన్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది.