కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా.. అన్ని సనిమాలు థియేరట్లలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ పాన్ ఇండియా లెవల్‌లో రావడం, తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉండడంతో చాలామంది చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో థియేర్లలో కూడా రష్ కనిపిస్తోంది. ఇక.. ఈ నెలలో పలు బాలీవుడ్ సినిమాలు థియేటర్‌తో పాటు ఓటీటీలో రాబోతున్నాయి. అవేంటో ఓ సారి చదవి తెలుసుకుందాం..
‘శభాష్ మిథు’
సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ జులై 15న థియేటర్లలోకి రానుంది. ఈ స్పోర్ట్స్ బయోపిక్‌లో మిథాలీ పాత్రలో నటి తాప్సీ నటించింది. మిథాలీ రాజ్ లెజెండరీ క్రికెటర్‌గా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందికి స్ఫూర్తిదాయకంగా ఉండడాన్ని ఈ సినిమాలో చూడొచ్చు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించింది.
‘హిట్ – ఫస్ట్ కేస్’
రాజ్‌కుమార్ రావు, సన్యా మల్హోత్రా జంటగా నటించిన ‘హిట్ – ఫస్ట్ కేస్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘శభాష్ మిథు’ తో పోటీకి రెడీ అయ్యింది. డాక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా జులై 15న రిలీజ్ కానుంది. ఈ కాప్ థ్రిల్లర్ మూవీ తెలుగులో విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాకి హిందీ రీమేక్ వర్షెన్. దీన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, కుల్దీప్ రాథోడ్ – గుల్షన్ కుమార్, టి-సిరీస్, దిల్ రాజు ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు.
‘షంషేరా’
రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ‘షంషేరా’ జులై 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వాణికపూర్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక యోధుడి తెగ ఖైదు చేయబడి, బానిసలుగా మార్చుకున్న క్రూరమైన అధికార సైన్యాధ్యక్షుడు శుద్ధ్ సింగ్ (దత్ పోషించిన పాత్ర) చేతిలో హింసికు గురవుతారు. కరణ్ మల్హోత్రా నేతృత్వంలో ‘షంషేరా’ నగరం కాజాలో సెట్ వేశారు.
యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన షంషేరా హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.
‘విక్రాంత్ రోనా’ (వీఆర్)
కిచ్చా సుదీప్ నటించిన కన్నడ సినిమా ఇది.. హిందీలో కూడా జులై 28న విడుదల కానుంది. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తెలుగులో సింగర్ మంగ్లీ పాడిన పాట ‘‘రా రా రక్కమ్మ” అందరినీ అలరిస్తోంది. అయితే.. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. షాలిని మంజునాథ్, జాక్ మంజునాథ్, సుదీప, ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
‘ఏక్ విలన్ రిటర్న్స్’
2014లో వచ్చిన ‘ఏక్ విలన్’ సినిమాకి సీక్వెల్ గా ‘‘ఏక్ విలన్ రిటర్న్స్” తీశారు. ఈ సినిమా జులై 29న విడుదల కాబోతుంది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ జోనర్లో జాన్ అబ్రహం, దిశా పటానీ, తారా సుతారియా, అర్జున్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. శోభా కపూర్, ఏక్తా కపూర్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మాతలతో ఈ మూవీ టి-సిరీస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు.
‘గుడ్ లక్ జెర్రీ’
అందాల తార, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన సినిమా ‘‘గుడ్ లక్ జెర్రీ’’ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుంది. దర్శకుడు సిద్ధార్థ్ సేన్‌గుప్తా తీసిని క్రైమ్-కామెడీ డ్రామా మూవీ డైరెక్ట్‌గా డిస్నీ+హాట్‌స్టార్‌లో జులై 29న రిలీజ్ కాబోతోంది. 2018 వచ్చిన తమిళ చిత్రం ‘కోలమావు కోకిల’ మూవీకి ఇది హిందీ రీమేక్ వర్షెన్. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా, ఆనంద్ ఎల్ రాయ్, మహావీర్ జైన్ నిర్మించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.