ఎట్టకేలకు తమ తనయుడిని మీడియాకి పరిచయం చేశారు నటి పూర్ణ దంపతులు. ఫస్ట్ టైం తన కొడుకును పూర్తిగా రివీల్ చేశారు. కొడుకు, భర్తతో పాటు ఫోటో దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ది ప్రిన్స్ అని కామెంట్ పెట్టింది.పూర్ణ కొడుకును చూసిన అభిమానులు బాబు చాలా అందంగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అచ్చు అమ్మ పోలికే అని కొనియాడుతున్నారు. పూర్ణ కొడుకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత ఏడాది పూర్ణ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఫహద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి రహస్యంగా జరిగింది. దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య పూర్తి చేశారు. పెళ్ళైన వెంటనే గర్భం దాల్చిన పూర్ణకి అబ్బాయి పుట్టిన సంగతి తెలిసిందే. ఇక పూర్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2, తీస్ మార్ ఖాన్ చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దసరాలో విలన్ భార్యగా కనిపించారు. వివాహం తర్వాత కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. మలయాళ అమ్మాయి అయినప్పటికీ పూర్ణకు తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. దర్శకుడు రవిబాబు డైరెక్షన్ లో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో నటించింది పూర్ణ.
Advertisement
తాజా వార్తలు
Advertisement