Wednesday, October 9, 2024

Accident – స‌ర్దార్ షూటింగ్ లో ప్ర‌మాదం .. స్టంట్ మ్యాన్ దుర్మ‌ర‌ణం ..

సర్దార్ 2 షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదంలో ఏలుమలై అనే స్టన్ మ్యాన్ విషాదకరంగా మరణించాడు. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ రెండవ భాగం ప్రస్తుతం రూపొందుతోంది. సర్దార్ 2 సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం ప్రారంభం కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్టంట్‌ మ్యాన్‌ ఏలుమలై
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎత్తు నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన స్టంట్ మ్యాన్ ఏలుమలై విషాదకరంగా మృతి చెందాడు.

స్టంట్ సీన్ చిత్రీకరిస్తుండగా 20 ఎత్తు నుంచి కిందపడి ఏలుమలై మరణించాడు. పై నుంచి కిందపడటంతో ఛాతీలో గాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదే విషయాన్ని ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ ధ్రువీకరించింది. సర్దార్ 2 సినిమా సెట్స్ లో జరిగిన ప్రమాదం కారణంగా ఏలుమలై అనే స్టంట్ మాన్ మరణించినట్లుగా వెల్లడించింది. షూట్ ముగిస్తున్న సమయంలో ఏలుమెలై దురదృష్ట వ్యవసాయత్తు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి గాయాలు పాలయ్యాడని వెంటనే దగ్గరలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తిరిగి తీసుకెళ్లామని పేర్కొన్నారు. అక్కడే ఉన్న డాక్టర్స్ టీం ఎంత కష్టపడినా ఆయనను బతికించుకోలేకపోయామని చెప్పుకొచ్చింది. ఏలుమలై కుటుంబానికి తాము అండగా నిలబడతామని ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ వెల్లడించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement