Thursday, October 17, 2024

OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఆడు జీవితం’.. ఎప్పుడంటే

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ‘ఆడు జీవితం’ పేరుతో విడుదలైంది. ఈ ఏడాది మార్చి 28న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అతి తక్కువ సమయంలో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. మొత్తం థియేట్రికల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ షోకు సిద్ధమైంది.

‘ఆడు జీవితం’ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్… తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ని ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాని జూలై 19 నుండి స్ట్రీమింగ్‌లోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇక ఈ మూవీ విడుదలైన మూడు నెలల తర్వాత ఓటీటీకి వస్తుండడంతో సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement