అక్కినేని కుటుంబంలో చైతన్య-శోభిత ల పెళ్లి పనులు మొదలయ్యాయి. శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. తాజాగా వీరి వివాహానికి సంబంధించిన శుభలేఖ వైరల్గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్లో డిసెంబర్ 4న శోభిత-నాగ చైతన్య ల పెళ్లి జరుగుతుందని, అంరూ వచ్చి ఆశీర్వదించాలని రాసుకొచ్చారు.
అన్నపూర్ణ స్టూడియోనే పెళ్లి వేదిక కాగా… రాత్రి 8.13 గంటలకు ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కానుంది. కొత్త జంటకు అభిమానులు, సన్నిహితులు ఇప్పటి నుంచే శుభాకాంక్షలు చెప్తున్నారు.