Sunday, October 6, 2024

Vijay Deverakonda | శ్రీలంక‌లో విజ‌య్ కు ఘనస్వాగతం..

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ కెరీర్‌లో 12వ సినిమాగా #VD12 తెర‌కెక్క‌తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ను శ్రీలంకలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం హీరో విజయ్ దేవరకొండతో పాటు చిత్రబృందం శ్రీలంక వెళ్లింది. లంకలో విజయ్‌కి ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. గీతగోవిందం లాంటి హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో, అదే విధంగా టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్య్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో మూవీలో విజ‌య్ న‌టిస్తున్నాడు. అవి వ‌రుస‌గా VD 13, VD 14 వ‌ర్కింగ్ టైటిల్స్‌తో తెర‌కెక్కుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement