ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ చిక్కుల్లో పడింది. ఆడియో స్ట్రీమింగ్ కంపెనీ పాకెట్‌ఎఫ్‌ఎం హాట్‌స్టార్‌కు షాకిచ్చింది. డిస్నీప్లస్ హట్‌స్టార్ తమ ఆడియో సిరీస్‌ని కాపీ చేసిందంటూ ఢిల్లీ హైకోర్టులో పటిషన్ దాఖలు చేసింది. హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో యక్షిణి అనే వెబ్ సిరీస్ ప్రసారం కాబోతుంది… అయితే, ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ… హాట్‌స్టార్‌పై కాపీరైట్ ఆరోపణలు చేస్తూ ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది.
పిటిషన్ ప్రకారం, కొంతకాలంగా PocketFM ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌గా పెయిడ్ మోడ్‌లో ఆడియో సిరీస్‌ను అందిస్తోంది. అందులో ఒకటి యక్షిణి.. కాగా, ఈ సిరీస్ పూర్తి కాపీరైట్ హక్కులను PocketFM కలిగి ఉంది. అయితే ఈ యక్షిణి సిరీస్‌ని అదే టైటిల్‌తో హాట్‌స్టార్.. వీడియో రూపంలో వెబ్ సిరీస్‌లోకి తీసుకురాబోతోంది. రేపటి నుంచి (జూన్ 14) ఈ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. దీంతో, ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ నిలిపివేయాలని, హాట్‌స్టార్ నుండి తొలగించాలని పాకెట్‌ఎఫ్‌ఎం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అలాగే ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను తొలగించేలా సంస్థను ఆదేశించాలని పాకెట్‌ఎఫ్‌ఎం తన పిటిషన్‌లో కోరును విజ్ఞప్తి చేసింది.
దీనిపై (గురువారం) విచారణ చేపట్టిన హైకోర్టు.. డిస్నీ+ హాట్‌స్టార్ ఈ విషయంపై తన ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయాలని భావిస్తుంది. దీంతో ఈ కేసుపై తుది తీర్పు వెలువడే వరకు యక్షిణి వెబ్ సిరీస్ ప్రసారాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తొంది.