Tuesday, October 1, 2024

Netflix | రాజ‌మౌళిపై డాక్యుమెంట‌రీ.. ఆగస్టు 2న ప్ర‌సారం

ఎస్ఎస్ రాజమౌళి జీవితచరిత్ర డాక్యుమెంటరీని విడుదల చేయనుంది. అనుపమ చోప్రా సమర్పించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరాన్, జో రస్సో, కరణ్ జోహార్ నుండి ఎస్ఎస్ రాజమౌళి, అలాగే సన్నిహితులు, సహచరులు ప్రభాస్, జూనియర్ ఎన్టిఆర్, రానా దగ్గుబాటిఎం, రామ్ చరణ్ వంటి వారి గురించి ఇందులో అనేక విశేషాలు ఉండబోతున్నట్లుసమాచారం. నెట్ఫ్లిక్స్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ తో కలిసి డాక్యుమెంటరీని రూపొందించింది.

ఇందులో ఇంటర్వ్యూలు, తెరవెనుక ఫుటేజీలతో భారతీయ, అంతర్జాతీయ సినిమాలపై రాజమౌళి ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. ఈ చిత్రం భారతీయ సృజనాత్మకతపై నెట్ఫ్లిక్స్ మోడరన్ మాస్టర్స్ డాక్ సిరీస్లో భాగంగా ఉంటుంది. ఇక ఎస్ఎస్ రాజమౌళి భారతీయ సినిమా గతిని మార్చిన దూరదృష్టి గల వ్యక్తి అని నిర్మాత, హోస్ట్ చోప్రా అన్నారు. ఆయన నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది.

ఆయన పురాణ కథనాలు కథ చెప్పే ప్రమాణాలు ఎంతో గొప్పవి. ఆయన అసాధారణ కెరీర్, సినీ ప్రపంచంపై ఆయన చూపిన శాశ్వత ప్రభావాన్ని హైలైట్ చేయడానికి నెట్ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

అప్లాజ్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ నాయర్ మాట్లాడుతూ.. ఈ ఎస్ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీపై నెట్ఫ్లిక్స్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్తో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అతని ప్రత్యేకమైన సృజనాత్మక కథన శైలి భారతీయ చిత్రనిర్మాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

ఇక ఆయన అందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వరకు అతని కళాత్మక అభివృద్ధిని ప్రదర్శించడానికి తాము సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యం ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రామాణికమైన భారతీయ కథలను రూపొందించడానికి మా అంకితభావాన్ని ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు.

- Advertisement -

నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.., దూరదృష్టిగల కథ, సినిమా ప్రతిభతో భారతీయ సినిమాలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఐకాన్ అని అన్నారు. అతని సాహసోపేతమైన స్ఫూర్తి, ఫాంటసీ, ఇతిహాస శైలులపై ప్రావీణ్యం ప్రపంచవ్యాప్తంగా వినోదాన్ని ఇష్టపడే ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. భారతీయ చరిత్ర, సంస్కృతి నుండి ఐకానిక్ కథలకు ప్రాణం పోసిందిని ఆమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement