Friday, November 22, 2024

AP | గోదావ‌రి జిల్లాలో భారీ స్టూడియో…

ఫిల్మ్ ఇండ‌స్ట్రీ విశాఖ కు స‌మాంత‌రంగా గోదావ‌రి జిల్లాల‌లో కూడా అభివృద్ది దిశ‌గా అడుగులు ప‌డుతు న్నాయా? ఆ జిల్లాల పెద్ద‌లు త‌మ ప్రాంతంలో కూడా ఇండ‌స్ట్రీ అభివృద్ది చేయాల‌నే ప్ర‌తిపాద‌న తెస్తున్నారా? ఈ ప్ర‌తిపాద‌నికి అమ‌రావతి రాజ‌ధాని నిర్మాణం కూడా కీల‌కం అవుతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సినిమా ఇండ‌స్ట్రీని కూడా న‌వ్యాంధ్ర రాజ‌ధానికి స‌మాంత‌రంగా గోదావ‌రి జిల్లాల్లో కూడా అభివృద్ది చేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

దాదాపు 100 ఎక‌రాల్లో భారీ ఎత్తున స్టూడియోలు నిర్మించాల‌నే ప్ర‌పోజ‌ల్ తెర‌పైకి వ‌స్తోంది. ఇటీవల కొంత మంది సినిమా పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబును కూడా కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఆ లోపు ప‌వ‌న్ వద్ద పూర్తి స్థాయి గోదారి స్టూడియో ప్రతిపాదనను పెద్ద‌లు పెట్టాలనుకుంటున్నారట‌.

ప్ర‌భుత్వం వ‌ద్ద భుములు ఉచితంగా కాకుండా కొనుగోలు ద్వారానే తీసుకుని స్టూడియోలు నిర్మిస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారట‌. గోదావ‌రి జిల్లాల్లో సినిమా షూటింగ్ లు జ‌ర‌గ‌డం అన్న‌ది చాలా కాలంగా కొన‌సాగుతుంది. ఇండ‌స్ట్రీ మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్ కి రాక ముందు నుంచే గోదావ‌రి ప్రాంతాల్లో షూటింగ్ లు జ‌రిగేవి.

ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ జ‌న‌రేష‌న్ స‌మ‌యంలో గొదావ‌రి జిల్లాలు షూటింగ్ కి మ‌రింత ఫేమ‌స్ గా మారాయి. కాల‌క్ర‌మేణా షూటింగ్ ల సంఖ్య ఆయా జిల్లాల్లో మ‌రంత‌గా పెరుగుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఎక్కువ శాతం షూటింగ్ లు గోదావ‌రి జిల్లాలోనే జ‌రుగుతున్నాయి.

ఇలాంటి త‌రుణంలో గోదావ‌రి అందాల్ని మ‌రింత‌ హైలైట్ చేస్తూ అక్క‌డ స్టూడియోలు నిర్మిస్తే బాగుంటుంద‌ని పెద్ద‌లు ప్లాన్ చేస్తున్నారుట‌. పాపికొండ‌లు ఇప్ప‌టికే ప‌ర్యాట‌క కేంద్రంగా ఉంది. దాన్ని కూడా మ‌రింత గా వృద్దిలోకి తీసుకొస్తే ఇండ‌స్ట్రీకి అనుకూలంగా ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. కూట‌మి ప్ర‌భుత్వం కూడా సినీ పెద్ద‌ల ప్ర‌తిపాద‌న‌ల‌కు అనుకూ లంగా ఉంటుంద‌ని పెద్ద‌లు విశ్వాసంతో వున్న‌ట్లు వినికిడి.

Advertisement

తాజా వార్తలు

Advertisement