తెలుగు సినీ ప్రేమికులకు సెప్టెంబర్ చాలా పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ నెల కానుంది. ప్రతి నెల, ప్రతి వారం చెప్పుకోదగ్గ సినిమా రిలీజ్‌లను చూస్తూనే ఉంటాం. ఈ నెలలో థియేటర్లలో విడుదలకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.. ఈ సెప్టెంబరులో బ్రహ్మాస్త్ర, పొన్నియిన్ సెల్వన్ -1 వంటి బిగ్-బడ్జెట్ సినిమాలతో పాటు మధ్యస్థ-బడ్జెట్ సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొననుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, దక్షిణ భారత సినిమాలు బలమైన కంటెంట్ తో.. వినూత్న కథనంతో ప్రేక్షకులను అలరించడానికి గట్టిగానే పోటీపడనున్నాయి. ఇక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి చూసి ఆనందించేలా సెప్టెంబర్‌లో బిగ్ స్క్రీన్ పైకి రావడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేటివి ఏంటో చూద్దాం.
Ranga Ranga Vaibhavanga – Sep 02
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా సినిమా ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమాకి గిరీశయ్య దర్శకత్వం వహించారు. ఇది (సెప్టెంబర్ 2న) థియేటర్లలో రిలీజ్ కు సద్ధింగా ఉంది.
First Day First Show – Sep 02
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా కథాంశంతో అనుదీప్ కెవి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ రాబోతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్స్ రాబట్టే విజేతగా ఉంటుందని అంచనాలున్నాయి.
Spider-Man: No Way Home (Extended Version) – Sep 02
టామ్ హాలండ్, జెండయా నటించిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్, ఒరిజినల్ కట్‌లో కనిపించని కొన్ని అదనపు ఫుటేజీలతో ఈ సినిమా రీ-రిలీజ్ కు సిద్థమైంది. దేశంలో, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ఎక్స్ టెండెడ్ వెర్షన్ హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ కానుంది.
Nenu Meeku Baaga Kavalsinavaadini – Sep 09
కిరణ్ అబ్బవరం హీరోగా.. శంకర్ దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ నేను మీకు బాగా కావాల్సినవాడిని. ఈ మూవీకి సంగీతం మణిశర్మ అందించగా.. సంజనా ఆనంద్, సోను ఠాకూర్ ప్రధాన పాత్రలలో బాబా భాస్కర్, గెటప్ శ్రీను, దేవి ప్రసాద్, ప్రగతి మరియు పలువురు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.
Kotha Kothaga – Sep9
అజయ్, విర్తి వాగన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త కొత్తగా’. హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి నిర్మించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సిద్ధు అనే సాధారణ కుర్రాడు రాజ వంశానికి చెందిన రాజీతో ప్రేమలో పడతాడు. ఇంతలో, రాజీ, తన కుటుంబ కోరిక మేరకు, మరొకరితో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ విషయం తెలిసిన సిద్ధు గుండె పగిలి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ఈ ట్రామాని సిద్ధూ అధిగమించగలడా? రాజీపై సిద్దూకి ఉన్న భావాల గురించి రాజీకి ఎప్పుడైనా తెలుస్తుందా? అనే స్టోరీలైన్ తో నడుస్తుందని, దీనిపైనా పెద్ద అంచనాలే ఉన్నాయంటున్నారు సినీ విమర్శకులు.
Oke Oka Jeevitham – Sep 09
శర్వానంద్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ ‘ఒకే ఒక జీవితం’ ఈ సినిమాకి నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరక్కిన ఈ సినిమా కణం అనే టైటిల్ తో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది.
Brahmastram (dub) – Sep 09
అయాన్ ముఖర్జీ అల్టిమేట్ ఇమాజినేషన్ తో హిందూ కల్చర్ కాన్సెప్ట్ తో తెరక్కిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ అటు బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఇది. రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో.. అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 3D, IMAX 3D , 4DX 3Dలో విడుదల కానుంది. ఈ మూవీ దేశంలోని స్టార్ స్టూడియోస్ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనుంది.
Aa Ammayi Gurinchi Meeku Cheppali – Sep 16
మోహన కృష్ణ ఇంద్రగంటి రచన, దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రంలో సుధీర్ బాబు, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని బెంచ్‌మార్క్ స్టూడియోస్ , మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
Saakini Daakini – Sep 16
‘శాకిని దాకిని’ అనేది దక్షిణ కొరియా సినిమా “మిడ్‌నైట్ రన్నర్స్”కి అధికారిక రీమేక్. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ అడాప్షన్‌లో తెలుగులో నివేతా థామస్, రెజీనా కసాండ్రా నటించారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, విప్లవ్ నిషాదమ్ ఎడిటింగ్ అందించిన ఈ సినిమాకి మైకీ ఎంసీ క్లియరీ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ సినిమాని తెరక్కించారు.
Krishna Vrinda Vihari – Sep 23
నాగ శౌర్య, షిర్లీ సెటియా రాబోయే రొమాంటిక్ కామెడీ ‘కృష్ణ బృందా విహారి’ సెప్టెంబర్ 23న తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ చిత్రానికి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. సాగర్ మహతి సంగీతం అందించగా, తమ్మి రాజు ఎడిటింగ్ చేశారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి, నాగ శౌర్య కలిసి ఈ సినిమాని నిర్మించారు.
Alluri – Sep 23
శ్రీవిష్ణు కాప్ క్యారెక్టర్ లో నటించిన మూవీ ‘అల్లూరి’. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా, లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్, బెక్కెం బబిత నిర్మించారు. కాయదు లోహర్, తనికెళ్ల భరణి మరియు రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందించగా, సినిమాటోగ్రఫీ రాజ్ తోట, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా పని చేశారు.
Gurthunda Seetakalam – Sep 23
గుర్తుందా సీతకాలం నాగశేఖర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం. ఇది 2020 కన్నడ భాషా చిత్రం లవ్ మాక్‌టెయిల్‌కి రీమేక్. ఈ చిత్రంలో సత్యదేవ్ కంచరణా, తమన్నా నటించారు.
Dongalunnaru Jagratta – Sep 23
దొంగలున్నారు జాగ్రత్త అనేది సతీష్ త్రిపుర దర్శకత్వం వహించిన థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో సముద్రఖనితో పాటు శ్రీ సింహ కోడూరి, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి కాళభైరవ సంగీతం అందించగా, యశ్వంత్ సి సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, మంజార్ స్టూడియోస్ బ్యానర్లపై డి సురేష్ బాబు, సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Avatar (remastered 4K) – Sep 23
జేమ్స్ కామెరూన్ అవతార్ 4K హై డైనమిక్ రేంజ్ ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రీ-రిలీజ్. డిసెంబరు 16న రిలీజ్ అవ్వనున్న అవతార్ సీక్వెల్ : ది వే ఆఫ్ వాటర్ రావడానికి మూడు నెలల ముందే ఈ సినమాని రీ-రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
Dhokha – Round D Corner – Sep 23
కూకీ గులాటి దర్శకత్వం వహించిన మలయాళ డ్రామా ధోఖా రౌండ్ డి కార్నర్. ఈ సినిమాలో ఆర్ మాధవన్, అపరశక్తి ఖురానా, దర్శన్ కుమార్, ఖుషాలి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా పట్టణ ప్రాంతపు జంట జీవితంలోని ఒక రోజు ఆధారంగా రూపొందింది. ట్విస్ట్‌లు, మలుపులతో ఊహించని ప్రయాణంలో తీసుకెళుతుంది. ప్రతి పాత్ర గ్రే షేడ్‌ని ప్రదర్శిస్తుంది.
vikram vedha (Hindi) – Sep 23
మాధవన్, విజయ్ సేతుపతి నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ నియో-నోయిర్ చిత్రానికి అధికారిక రీమేక్ విక్రమ్ వేద. ఈ బాలీవుడ్ రీమేక్‌ను పుష్కర్, గాయత్రి హెల్మ్ చేయనున్నారు. ఈ రీమేక్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శీతల్ భాటియా, భూషణ్ కుమార్, నీరజ్ పాండే, శిబాశిష్ సర్కార్, ఎస్ శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
PS 1 (Ponniyan Selvan 1) – Sep 30
ఐదు దశాబ్దాల క్రితం కల్కి రాసిన చారిత్రాత్మక నవల.. మణిరత్నం కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్: 1’ (PS-1) సెప్టెంబర్ 30, 2022న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ భారీ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, జయరామ్, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, అశ్విన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాకుమాను, ఆర్.శరత్‌కుమార్, ఆర్.పార్తిబన్, ప్రభు, ప్రకాష్ రాజ్, రెహమాన్ తదితరులు సహాయక పాత్రల్లో కనిపిస్తారు. మణిరత్నం తన ప్రొడక్షన్ స్టూడియో మద్రాస్ టాకీస్‌పై, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్లిరాజా సుభాస్కరన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.